: కోయకుండానే ఏడిపిస్తున్న ఉల్లిపాయలు


దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లిపాయల ధరలు ప్రజల్ని కోయకుండానే ఏడిపిస్తున్నాయి. ఢిల్లీలో కేజీ ఉల్లి ధర 50 రూపాయలకు చేరింది. నెల క్రితం కేజీ 20 రూపాయలున్న ఉల్లిపాయల ధర ఒక్కసారిగా రెట్టింపవ్వడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సూరత్, ముంబై, పాట్నా, భోపాల్ సహా అన్ని చోట్లా ఉల్లి ధర రెట్టింపయ్యింది. వీటితో పోల్చుకుంటే హైదరాబాదే కాస్త నయం అనేలా కేజీ 35 రూపాయలకు చేరుకుంది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఢిల్లీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఉల్లి ఘాటు ఎన్డీయే ప్రభుత్వానికి తగిలి అప్పట్లో గద్దెదిగిందని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. మరి ఈసారి ఉల్లి ఘాటు కాంగ్రెస్ కు తగలనుందా? అని అవే వర్గాలు చర్చించుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News