: ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జైలులో సబ్ వార్డన్లుగా పని చేస్తున్న రవీందర్ రెడ్డి, వేణు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారుల చేతికి చిక్కారు. రిమాండ్ ఖైదీ తిరుపతి నుంచి 8 వేల రూపాయల నగదు, 25 కిలోల బియ్యం లంచం తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా ఎసీబీ అధికారులు పట్టుకున్నారు.