: జింబాబ్వే కు బయల్దేరిన టీమిండియా


భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు బయల్దేరి వెళ్లింది. రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. జట్టుకు విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తాడు. సెలక్టర్లు ధోనీకి విశ్రాంతి కల్పించారు. దీంతో ధోనీ లేకుండానే 15 మంది సభ్యుల భారత ఆటగాళ్ల బృందం ఈ ఉదయం ముంబై నుంచి జింబాబ్వే పయనం అయింది. విండీస్ గడ్డపై విండీస్, శ్రీలంకతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ లో కోహ్లీ మూడు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించగా, రెండింటిలో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ భవిష్యత్తు కెప్టెన్సీ విషయంలో ఈ సిరీస్ కీలక పాత్ర పోషించనుంది.

  • Loading...

More Telugu News