: మోడీ టీమ్ పై కేంద్ర మంత్రి కామెంట్
వచ్చే ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో బీజేపీ ప్రకటించిన 20 కమిటీలను కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు బీజేపీ.. క్రికెట్ టీమ్, హాకీ టీమ్, ఫుట్ బాల్ టీముల్లాగా ఎన్నో టీములను ప్రకటిస్తోందని.. కానీ, వారు ఎన్ని టీములను ప్రకటించినా తమ చేతిలో చిత్తవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో మరోసారి బీజేపీ మట్టికరవడం ఖాయమని తివారీ వ్యాఖ్యానించారు. కమలనాథులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిలో ఏ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రచార సారథి మోడీ నాయకత్వంలో పనిచేసేలా బీజేపీ నిన్న రాత్రి 20 కమిటీలకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేతలు అద్వానీ, వాజ్ పేయిలు ఈ కమిటీలకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు.