: సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేషంలో నలుగురి జీవితాల్ని నాశనం చేసిన మోసగాడు
మోసాల్లో ఇదోరకం..! అమాయక తల్లిదండ్రులను నమ్మించి వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని, పెద్ద ఎత్తున కట్నం తీసుకోవడం, ఆనక వాళ్ళని మోసపుచ్చుడం. ఓ నయవంచకుడి నిజస్వరూపమిది. వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తెలగపాలేనికి చెందిన శ్రీనివాసరావు సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మించి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు తెలిపింది. చెన్నై, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఒక్కో అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.