: విశాఖ తీరానికి చేరిన అండమాన్ ఓడ
ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా సముద్రం మధ్యలోనే మూడురోజుల నుంచి నిలిచిపోయిన అండమాన్ నికోబార్ ప్రయాణీకుల ఓడ విశాఖ సముద్ర తీరానికి చేరుకుంది. ఈనెల 18న విశాఖ నుంచి అండమాన్ బయల్దేరిన ఈ ఓడలో సుమారు 800 మంది ప్రయాణికులు ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగా ఏర్పడిన సమస్యతో వారు ఆందోళనకు గురయ్యారు. దాంతో అధికారులు తగు చర్యలు తీసుకొని ఓడను సురక్షితంగా విశాఖ తీరానికి చేర్చడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ నెల 28న ఓడ తిరుగు ప్రయాణం అవుతుంది.