: నడి రోడ్డుపై పట్టపగలు యువతి సజీవ దహనం
భారతదేశంలో మహిళలపై అరాచాకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహిళాలోకం కాలంతోపాటు పోటీపడుతున్నందుకు సంతోషించాలో లేక దారుణాల బారినపడి అర్ధాంతరంగా జీవితాలు చాలిస్తున్నందుకు బాధపడాలో అర్ధం కాని పరిస్థితి చోటు చేసుకుంటోంది. అత్యాచారాలు, యాసిడ్ దాడులు, శారీరక, మానసిక దాడులు పెరిగిపోతున్నాయి. యూపీలో తాజాగా చోటు చేసుకున్న ఘటన అలాంటి దాష్టీకమే. ఉత్తరప్రదేశ్ లో ఒక యువతిని నడి రోడ్డుపై పట్టపగలు ఐదుగురు దుండగులు సజీవ దహనం చేసి పారిపోయారు. యూపీలోని బీజనూర్ జిల్లాలోని ముద్దూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.