: టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఎక్కడ?


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల కిందట దేవరకద్రలో జరిగిన కాల్పుల్లో సోదరుడు జగన్మోహన్ మరణించినప్పటి నుంచి శేఖర్ కనిపించకపోవడంతో ఆయనపై అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, రెండు రోజుల కిందట ఎమ్మెల్యే శేఖర్ వాహనంలో ఆత్మకూరు దారిలో వెళుతుండగా, కొంతమంది యువకులు చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే బెంగళూరులో ఉన్నారా? లేక హైదరాబాదులోనే బంధువుల నివాసంలో ఆశ్రయం తీసుకుంటున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులను కూడా అనుమానితులుగా వెతుకుతున్నట్లు సమాచారం. తన భర్తను ఎమ్మెల్యే ఎర్ర శేఖరే చంపించాడని జగన్మోహన్ భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News