: వరద సహాయక చర్యలకు హెలికాప్టర్లు
గతకొద్ది రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా అతలాకుతలం అయింది. నాలుగురోజులుగా ఎడతెరిపినివ్వని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, పలు గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలు స్థంభించాయి. తాజా పరిస్థితి పట్ల స్పందించిన యంత్రాంగం మూడు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో వరద బాధిత ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్ల ద్వారా ఆహారపొట్లాలు జారవిడవనున్నారు. అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష ముగిసిన వెంటనే చాపర్లు సహాయచర్యలకు ఉపక్రమిస్తాయి.