: 20 కమిటీలకు మోడీయే నాయకుడు


బీజేపీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే 20 ఉప కమిటీలకు రూపకల్పన జరిగింది. ఈ కమిటీలన్నీ కలిసి 2014 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నాయి. సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషి, నితిన్ గడ్కరీ, యశ్వంత్ సిన్హా తదితర సీనియర్ నేతలు మోడీ ఆధ్వర్యంలోని ఉప కమిటీలలో వివిధ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా మోడీయే వీరందరికీ మార్గదర్శనం చేస్తారు. వీరందరికీ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్, అద్వానీ, వాజపేయి దిశానిర్ధేశం చేస్తారు. నిన్న పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, మోడీ ఢిల్లీలో సమావేశమై ఉప కమిటీలను ఎంపిక చేశారు. ఈ వివరాలను పార్టీ జనరల్ సెక్రటరీ అనంతకుమార్ మీడియాకు తెలిపారు.

మురళీ మనోహర్ జోషి మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా పనిచేస్తారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతను నితిన్ గడ్కరీకి అప్పగించారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, అమిత్ షా, సుదాంశు త్రివేది ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా ప్రచార బాధ్యతలు చూస్తారు. మోడీ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రసంగించేలా బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులు అనంతకుమార్, వరుణ్ గాంధీకి అప్పగించారు. కొత్తగా నమోదైన ఓటర్లను ఆకర్షించే బాధ్యతలను అమిత్ షా, పూనం మహాజన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది.

  • Loading...

More Telugu News