: తెలంగాణ విషయంలో కేంద్రం మరోసారి నమ్మక ద్రోహం : కేటీఆర్
రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు మండిపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి నయవంచనకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సడక్ బంద్ ను నిర్వీర్యం చేయడానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి యత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాదు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన సడక్ బంద్ లో అందరూ స్వచ్ఛంధంగా పాల్గొనాలని కోరారు.