: తొమ్మిది ఫార్మా కంపెనీలకు రూ.2500 కోట్ల జరిమానా
దేశంలోని తొమ్మిది ఫార్మా కంపెనీలకు 'నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ' రూ.2500 కోట్ల జరిమానా విధించింది. ఆస్థమా రోగులు వాడే 'డోక్సీఫైలైన్' ట్లాబెట్ పై మితిమీరిన రుసుం (రూ.80 నుంచి రూ.110) వసూలు చేస్తున్నారన్న కారణంగా ఈ జరిమానా వడ్డించింది. జరిమానాకు గురైన కంపెనీల్లో ర్యాన్ బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, గ్లెన్ మార్క్, సిప్లా, కాడిల్లా ఉన్నాయి.