: 2జీ కేసులో అనిల్, టీనా అంబానీకు కోర్టు సమన్లు
2జీ స్పెక్ట్రం కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సీబీఐ ఎదుట హాజరు కావాలంటూ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరితో పాటు మరో 11 మందికి కూడా కోర్టు నేడు నోటీసులు పంపింది. తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఓపి శైనీ మాట్లాడుతూ..'ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకునేందుకు వీరిద్దరి సాక్ష్యం అవసరమని మేము గుర్తించాము' అని అన్నారు. దాంతో, త్వరలో వీరిద్దరూ సీబీఐ ఎదుటకు రానున్నారు.