: సర్పంచ్ అభ్యర్థికి కొండ ముచ్చుల ప్రచారం
ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రచారంలో గిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. కానీ ఈ సర్పంచి మాత్రం తమ గ్రామానికి రక్షణగా నిలబడ్డ కొండముచ్చులతో ప్రచారం చేయించుకుంటూ ఆదరణ పొందుతున్నాడు. కరీంనగర్ జిల్లా వల్లంపహాడ్ కు చెందిన మునీందర్ గ్రామస్తులకు ఏ ఇబ్బంది కలిగినా పరిష్కరించడంలో ముందుంటాడు. అలాగే పదేళ్ల క్రింద వల్లంపహాడ్ గ్రామానికి విపరీతమైన కోతుల బెడద ఉండేది. గ్రామంలో చేరిన కోతులు ఊరు మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ కిష్కిందకాండను తలపింప చేస్తుండేవి. వీటి బారిన పడని కుటుంబం ఉండేది కాదంటే అతిశయోక్తికాదు.
దీంతో వాటీ పీడ విరగడ చెయ్యాలని ఆలోచించిన మునీందర్ రెండు కొండముచ్చులను కొని తెచ్చాడు. అంతే, కోతులు గ్రామానికి రావడం మానేశాయి. ఆ విధంగా కోతుల బెడద పరిష్కారమైంది. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ గ్రామం నుంచి సర్పంచి అభ్యర్ధిగా మునీందర్ నిలబడ్డాడు. తమ గ్రామాన్ని కోతుల బారినుంచి రక్షించిన కొండముచ్చులతో ప్రచారం చేస్తున్నాడు. గెలుస్తానని కూడా నమ్మకంగా చెబుతున్నాడు.