: పాక్ జైల్లో 12 ఏళ్లు మగ్గి.. అడ్రస్ మర్చిపోయిన అభాగ్యుడి కథ
ఇది ఓ అభాగ్యుడి కథ. 12 ఏళ్లు జైల్లో మగ్గి అడ్రస్ మర్చిపోయిన ఆశాజీవి కథ. అమృతసర్ లోని రెడ్ క్రాస్ అధికారి రణధీర్ ఠాకూర్ కథనం ప్రకారం, మహ్మద్ అహ్మద్ (45)`16 ఫిబ్రవరి 2012లో పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. పాకిస్థాన్ రికార్డుల ప్రకారం ఇతను మహ్మద్ అజీజ్ కుమారుడైన అహ్మద్ గా తెలుస్తోంది. ఇతగాడు ఉత్తర్ ప్రదేశ్ వాసి. అయితే ఇతను అప్పటి నుంచి నేటీకీ సరైన అడ్రెస్ చెప్పలేకపోతుండడంతో అమృతసర్ లోని రెడ్ క్రాస్ భవన్ లో ఆశ్రయం కల్పించారు. అయితే ఇతను పలు రకాలు చిరునామాలు చెబుతుండడంతో అతనికి మానసిక సమస్యలు ఉన్నాయోమేనని ముగ్గురు డాక్టర్ల బృందం పరీక్షించింది.
కానీ అతనికి ఆ రకమైన సమస్యలు లేవని తేలింది. ఇప్పటికే అతను చెప్పిన అడ్రెస్ తనిఖీకి పంపించగా అక్కడ అతనికి సంబంధించినవారెవరూ లేరని తేలింది. అయినప్పటికీ అతను యూపీకి చెందినవాడేనని, అందులో సందేహం లేదని రెడ్ క్రాస్ అధికారులు హామీ ఇస్తున్నారు. అయితే అతను పాక్ కి యూపీనుంచి ఎందుకు వెళ్లాడని అడిగితే అక్కడ తమ బంధువులను కలిసేందుకు వెళ్లానని, పోలీసులు నిర్బంధించారని తెలిపాడు.
అక్కడ తనకు భార్య, పాప కూడా ఉన్నారని చెబుతున్నాడు. అలాగే ఉత్తర ప్రదేశ్ లో కూడా తనకు పెళ్లయిందని భార్యపిల్లలు ఉన్నారని అంటున్నాడు. తాజాగా.. తాను లాల్ కున్ ప్రాంతానికి చెందనివాడినని చెబుతున్నాడు. ఇతని సమాచారంతో రెడ్ క్రాస్ అధికారులు వెతుకులాట మొదలుపెట్టారు.