: యూపీలో బీఎస్పీ నేత దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సర్వేశ్ సింగ్ సీపు హత్యకు గురయ్యారు. ఈ ఉదయం యూపీలోని అజమ్ గర్హ్ లో ఆయన నివాసం వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి కాల్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యే అక్కడిక్కడే మరణించారు.ఈ ఘటనతో జిల్లా యంత్రాగాన్ని అలర్ట్ చేసి, ప్రధాన రహదారులలోని చెక్ పోస్టుల వద్ద గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అటు బీఎస్పీ నేత మరణంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. సర్వేశ్ ను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండు చేస్తున్నారు. 35 సంవత్సరాల సర్వేశ్ సింగ్ యూపీలోని సగరి నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే, అమర్ సింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్లడంతో.. సర్వేశ్ కూడా పార్టీని వీడారు.