: వందో టెస్టు ముంగిట హర్భజన్ సింగ్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. ఆస్ట్రేలియాతో చెన్నయ్ లో జరగనున్న తొలి టెస్టు భజ్జీ కెరీర్ లో వందో టెస్టు కానుంది. కాగా, వంద టెస్టులు ఆడిన భారత క్రికెటర్లలో ఈ పంజాబ్ వీరుడు పదోవాడు. చాన్నాళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన హర్భజన్ తొలి టెస్టులో ఆడడం ఖాయమైంది. ఇప్పటి వరకు 99 టెస్టులాడిన ఈ విలక్షణ ఆఫ్ స్పిన్నర్ 408 వికెట్లు సాధించాడు. 2191 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు కూడా ఉండడం విశేషం.