: అమెరికా, రష్యా చర్చలకు స్నోడెన్ ఎఫెక్ట్
ఎడ్వర్డ్ స్నోడెన్ కన్నా తమకు అమెరికాతో సత్సంబంధాలే ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించినా ఫలితం దక్కలేదు. రష్యాతో త్వరలో జరగాల్సిన చర్చలను అమెరికా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యాలో పర్యటించాల్సి ఉంది. అయితే, గతకొంతకాలంగా తమ రహస్యాలను బహిర్గతం చేసి కంట్లో నలుసులా తయారైన స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో ఆశ్రయం పొందడం పట్ల వైట్ హౌస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒబామా పర్యటన రద్దయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.