: ఏవోబీలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వద్ద మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయగఢ్ సమీపంలోని అడవుల్లో పోలీసులు తాజాగా చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులు తారసపడగా.. ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరో ఏడుగురు మావోలు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.