: కోహినూర్ వజ్రం బ్రిటిషర్ల సొంతం, భారత్ కు అప్పగించేంది లేదు: కామెరూన్


విశ్వవిఖ్యాత కోహినూర్ వజ్రం తమ సొంతమని, భారత దేశానికి తిరిగిచ్చేది లేదని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కుండబద్ధలు కొట్టారు. ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో 1526లో లభ్యమైన ఈ విశిష్టమైన వజ్రం ప్రస్తుతం బ్రిటిష్ రాణి కిరీటంలో తళుకులీనుతోంది. అప్పట్లో ఓ ఆంగ్లేయ గవర్నర్ జనరల్ ఈ 105 క్యారట్ల వజ్రాన్నివిక్టోరియా మహారాణికి బహూకరించినట్టు తెలుస్తోంది.

ప్రపంచంలో పేరెన్నికగన్న వజ్రాల్లో ఒకటైన కోహినూర్  ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్ లో కొలువుదీరి ఉంది. కాగా, భారతీయులు ఆ వజ్రం తమదేనని, తిరిగివ్వాల్సిందేనని పట్టుబట్టడం... బ్రిటన్ ప్రభుత్వాలు ససేమిరా అనడం పరిపాటిగా మారింది.

  • Loading...

More Telugu News