: డోప్ టెస్టులో విఫలమైన ఐపీఎల్ బౌలర్


ఐపీఎల్-6 సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో ఓ బౌలర్ విఫలమయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన ప్రదీప్ సంగ్వాన్ తొలి విడత పరీక్షలో విఫలమయ్యాడు. అయితే రెండో విడత పరీక్షా ఫలితాలు వెలువడ్డాడక అందులో కూడా నిషేధిత ఉత్ప్రేరక పదార్ధాల ఆనవాళ్లు లభిస్తే అప్పుడు ఇతను డోపింగ్ కు పాల్పడ్డట్టు లెక్క. అయితే రెండో దశ పరీక్షలకు ఇతని శాంపిళ్లు పంపారు వాటి రిజల్ట్ వచ్చాకే ఇతనిపై చర్యతీసుకునే అవకాశముందని బీసీసీఐ అధికారు తెలిపారు. కాగా, దేశవాళీ పోటీల్లో ఢిల్లీ జట్టుకు ఆడే సంగ్వాన్, మునుపటి ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.

  • Loading...

More Telugu News