: సోదరుడిని ఎమ్మెల్యేనే హత్య చేయించాడా?
జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (చంద్రశేఖర్) సోదరుడు జగన్మోహన్ హత్య కొత్త మలుపు తీసుకుంది. తన భర్తను ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించాడని జగన్మోహన్ భార్య అశ్రిత ఆరోపిస్తున్నారు. పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశానని, దానిని ఉపసంహరించుకోకుంటే, భర్త జగన్మోహన్ ను చంపుతానని ఎమ్మెల్యే శేఖర్ బెదిరించారని ఆమె తెలిపారు. కనుక ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నిన్న దేవరకద్రలో జగన్మోహన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.