: సడక్ బంద్ లో అంబులెన్స్ లకు మినహాయిపంపు: కోదండరాం
ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం నాన్చుడు ధోరణికి నిరసనగా తెలంగాణ రాజకీయ ఐకాస చేపడుతున్న సడక్ బంద్ లో అంబులెన్స్ వంటి అత్యవసర సేవల వాహనాలకు మినహాయిపంపు ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కొత్తూరు, ఆలంపూర్ మధ్య బీజేపీ రేపు సడక్ బంద్ ప్రచార యాత్ర నిర్వహించనున్న సందర్భంగా ప్రజలు ప్రయాణాలు మానుకొని స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. శంషాబాద్-ఆలంపూర్ రహదారిపై పన్నెండు ప్రదేశాల్లో సడక్ బంద్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఐకాస కన్వీనర్ కోదండరాం చెప్పారు.