: యూపీలో మరో పరువు హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు చట్టాలు చేసినా.. పోలీసులు, స్వచ్చంధ సంస్థలు అవగాహన కల్పిస్తున్నా పరువు హత్యలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా స్నేహితుడిని ప్రేమ పెళ్లి చేసుకుని నెల రోజుల తరువాత ఇంటికొచ్చిన షీబు(18) ని ఆమె తండ్రి, తాత కలిసి కాల్చిచంపారు. నెల రోజులు ఇల్లు విడిచి వెళ్లిందని, తాము కాదన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని వచ్చిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, ఇంటికి వచ్చిన షీబును తుపాకీతో కాల్చిచంపినట్టు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి, తాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.