: ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో గ్రామాలు
ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పెన్ గంగ నది వరద తీవ్రతకు సిర్పూర్ (టి) మండలంలోని టోంకిని, వెంకట్రావుపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాంతో, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అటు తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో వేమనపల్లిలో 600 ఎకరాలు,కోటపల్లి మండలంలో వెయ్యి ఎకరాల మేర పంట పొలాలు నీట మునిగాయి. స్థానిక తాటిచెట్టు ఒర్రె వంతెనపై నుంచి పెన్ గంగ ప్రవహిస్తుండడంతో ఉడికిలి మీదుగా మహారాష్ట్ర వెళ్లే మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు బెల్లంపల్లి ఏరియాలో ఖైరిగూడ, డోర్ని 1,2 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది.