: కాబోయే అమ్మలు కాస్త జాగ్రత్తగా ఉండాలి


అమ్మలు కావాలనుకుంటున్నారా... అయితే గర్భవతిగా ఉండే సమయంలో విపరీతంగా లావు కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మీకు పుట్టే బిడ్డలు కూడా ఊబకాయం సమస్యతో సతమతమవ్వాల్సి ఉంటుందట. ఈ విషయం ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కెనడాలో నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో గర్భవతులుగా ఉన్న సమయంలో తల్లులు విపరీతంగా బరువు పెరిగితే వారికి పుట్టబోయే బిడ్డలు కూడా స్థూలకాయులవుతారని తేలింది. తల్లులు గర్భం ధరించిన తొలి నాలుగున్నర నెలల్లో బాగా లావయితే వారికి పుట్టే పిల్లలు కూడా బాగా బరువుగా, పొడుగ్గా ఉంటారని తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి తల్లులు కాబోయే వారికి ఈ విషయంపై మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News