: ఆగష్టులో సమైక్యాంధ్ర భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆరోపించింది. విశాఖపట్నంలో సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ప్రతినిధి అడారి కిషోర్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే విదేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమవ్వాలంటే రాష్ట్రం కలిసుండాల్సిన అవసరముందన్నారు. ఆగష్టు చివరి వారంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కిషోర్ తెలిపారు.