: మోడీ 'కుక్కపిల్ల' ఎఫెక్ట్.. ఢిల్లీ బీజేపీలో ముసలం


భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అమీర్ రజా హుస్సేన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయెల్ ఆమోదించారు. 'కారుకింద కుక్కపిల్ల పడితే బాధపడతాం కదా', అంటూ గోధ్రా అల్లర్ల మృతులపై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ చేసిన కరుణపూరిత వ్యాఖ్యలను అమీర్ రజా తప్పుబట్టారు. దీంతో బీజేపీ అధినాయకత్వం రజాపై కన్నెర్ర చేసింది. హద్దుల్లో ఉండాలంటూ హెచ్చరించింది. అయినా, దూకుడు తగ్గించని రజా.. మోడీ కన్నా పార్టీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ లేదా సుష్మా స్వరాజ్ ను ప్రధానమంత్రి అభ్యర్ధిగా ముస్లింలు ఇష్టపడతారని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర కలకలం రేగింది. ఎవరినీ ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదన్న ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు ప్రకటించారు.

  • Loading...

More Telugu News