: శంకర్రావుపై దయచూపిన కోడలు
మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుపై పెట్టిన కేసులను ఆయన కోడలు వంశీప్రియ ఉపసంహరించుకుంది. కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. తన మామ శంకర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వరకట్నం పేరుతో తనను వేధిస్తున్నారంటూ వంశీప్రియ కొన్నిరోజుల కిందట ఫిర్యాదు చేసింది. దాంతో, చర్యలు తీసుకున్న పోలీసులు శంకర్రావును ఆరెస్టు చేశారు. ఆ వెంటనే ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.