: సచిన్ ఎప్పటికీ మావాడే: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఇచ్చిన గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదాను ఎయిర్ ఫోర్స్ రద్దు చేసిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సచిన్ ఇప్పటికీ గౌరవ కెప్టెన్ హోదాతో కొనసాగుతున్నారని, ఎయిర్ ఫోర్స్ కుటుంబంలో ఆయనొక సభ్యుడని వెల్లడించాయి. అయితే, బ్రాండ్ అంబాసిడర్ లాంటి హోదా ఏమీ లేదని ఎయిర్ ఫోర్స్ వర్గాలు స్పష్టం చేశాయి. సచిన్ తీరిక లేకుండా ఉండడం వల్ల అతడి సేవలను వినియోగించుకోలేకపోతున్నామని చెప్పాయి.