: ఆస్తి కోసం కన్నవారి గొంతులు కోసిన కిరాతకులు
'డబ్బు మా చెడ్డది' అన్న ఓ సినీ రచయిత మాటల్ని నిజం చేస్తూ కన్నవారినే ఆస్తి కోసం కడతేర్చారా రాక్షసులు. మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం కుప్పగనుల గ్రామ శివారులోని దొంగరోడ్డు పెబ్బేరుకు చెందిన బాలరాజు(60), ఈశ్వరమ్మ(55) దంపతులను వారి కన్న కొడుకులే హత్య చేశారు. తల్లిదండ్రుల వద్ద స్థిరాస్తులతోపాటు అధిక మొత్తంలో నగదు ఉండడంతో, గత కొన్ని నెలలుగా ఆస్తి పంచాలని కొడుకులు వారిపై ఒత్తిడి తెచ్చారు. వారి కోరికను తిరస్కరించడంతో కుమారులు రవీందర్, వీరేందర్ లు అత్యంత పాశవికంగా తల్లిదండ్రుల గొంతులు కోసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాలను పొలాల్లో పడేశారు. అనుమానాస్పద హత్యలుగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానంతో విచారణ చేయడంతో హంతకులు దొరికారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.