: సరిహద్దు వద్ద చొరబాట్లకు 300 మంది ఉగ్రవాదులు రెడీ
భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్ గీసింది. అందులో భాగంగా భారత సరిహద్దుల్లో 300 మంది ఉగ్రవాదుల్ని సిద్దంగా ఉంచింది. వాతావరణంలోని అనుకూలతను ఉపయోగించుకుని వారిని అక్రమంగా సరిహద్దుల్ని దాటించేందుకు కుట్ర పన్నిందని మన నిఘా వ్యవస్థ, భద్రతా దళాలు తెలిపాయి. భారీ వర్షాలు, మంచు కురుస్తున్నప్పడు భద్రతా దళాలు ఆదమరచినప్పుడు, సరిహద్దులు దాటేందుకు 300 మంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నాయి. ఇప్పటికే సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్న పలువురిని అడ్డుకున్నట్టు భద్రతా దళాలు తెలిపాయి. విడతకు 10 మంది చొప్పున పలు సమూహాలుగా సరిహద్దులు దాటుతున్నారని వీరు తెలిపారు.