: కరుగుతున్న 'అమర్ నాథ్' హిమలింగం


అమర్ నాథ్ శివలింగం కరుగుతోంది. సాధారణంగా వేసవి ఎండలకు కరిగే మంచు శివలింగం ఈసారి వర్షాకాలంలో కూడా కరుగుతోంది. ఇప్పటికే అమర్ నాథ్ హిమలింగం ఒక అడుగు మేర కరిగిపోయింది. ఈ శివలింగం.. సాధారణ సమయం కంటే ముందే కరిగిపోతుండడం పట్ల భక్తులు విస్మయం చెందుతున్నారు. జూన్ 29 న ప్రారంభమైన అమర్ నాథ్ యాత్రలో పాల్గొనేందుకు 6 లక్షల మంది భక్తులు రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. సముద్ర మట్టానికి 13000 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకునేందుకు వీరంతా 45 కిలోమీటర్ల దూరాన్ని నడక ద్వారా సాగించనున్నారు. అయితే భద్రత, ఆరోగ్య కారణాల రీత్యా భద్రతా దళాలు కొంత మంది యాత్రికులను మాత్రమే యాత్రకు అనుమతిస్తున్నాయి.

  • Loading...

More Telugu News