: చైనాలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు


చైనాలో గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో, వివిధ వ్యవస్థల మధ్య సంబంధాలు తెగిపోయి జనజీవనం పూర్తిగా స్థంభించింది. ఈ వర్షాల కారణంగా వందమందికి పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇక వందలమంది గల్లంతయ్యారు. దాంతో, సహాయక చర్యలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం దాదాపు నాలుగువందల మందిని రక్షించింది. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు తెగిపోవడంతో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News