: మోడీజీ, మీ దృష్టిలో సెక్యులరిజం అంటే...?: దిగ్విజయ్
మోడీజీ, సెక్యూలరిజం అంటే మీ దృష్టిలో అర్థమేంటో? అంటూ ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 'లౌకికవాదమంటే.. అద్వానీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే సంస్కృతి. మరి మీ దృష్టిలో ఏంటి?' అని అడిగారు. లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ సమస్యల నుంచి తప్పించుకోజూస్తుందంటూ, మోడీ అంతకుముందు ఆ పార్టీని ఏకి పారేశారు. సమస్య ఎదురైన ప్రతీసారి కాంగ్రెస్ లౌకికవాద ముసుగు తగిలించుకుంటుందని దెప్పిపొడిచారు. దీనికి దిగ్విజయ్ పై విధంగా స్పందించారు.