: కడప దర్గాను దర్శించుకున్న హీరో కల్యాణ్ రామ్


హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఈ ఉదయం కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కల్యాణ్ రామ్ హీరోగా 3డీ రూపంలో తెరకెక్కిన పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం 'ఓం' ఈనెల 19న విడుదలవబోతోంది. ఈ సందర్బంగా ఆయన దర్గాను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చిత్రం విజయం సాధించాలని దేవుడిని కోరుకున్నట్లు కల్యాణ్ రామ్ తెలిపారు. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కల్యాణ్ రామ్ సొంతంగా నిర్మించారు.

  • Loading...

More Telugu News