: కోర్టుకు హాజరైన ధర్మాన,సబిత


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదు నాంపల్లి కోర్టులో ఈ ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో వీరి విచారణ ప్రారంభమవనుంది. అటు ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఇదిలావుంటే ధర్మాన, సబితను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని అంతకుముందు సీబీఐ పిటిషన్ వేయగా, ఆ విచారణ 19వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News