: భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి: ఆనం


ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగదంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. నెల్లూరులో నేడు జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు. దమ్ముంటే తెలంగాణ అంశంపై పార్లమెంటులో మద్దతు పొందాలని సవాల్ విసిరారు. ఇక ఈ సదస్సుకు హాజరైన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News