: ఈ దేశంలో పుట్టడమే పాపం అనుకునే వ్యక్తి రాహుల్: బీజేపీ


రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ మరోసారి విమర్శనాస్త్రాలు గురిపెట్టింది. ఈ దేశంలో పుట్టడమే పాపం అనుకునే వ్యక్తిగా రాహుల్ ను అభివర్ణించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మురళీధర్ రావు హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటు సమావేశాలప్పుడు సభలో పుస్తకాలు చూసి మాట్లాడే రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఏమాత్రం సరిపోడని, ప్రధాని పదవికి మోడీయే సమర్థుడని అన్నారు. రాహుల్ ఇంకా ఒక్క పరీక్షా పాస్ కాలేదని చెబుతూ, మోడీ అగ్నిపరీక్షలను తట్టుకుని నిలబడిన వ్యక్తని కొనియాడారు. త్వరలో మోడీతో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మురళీధర్ రావు చెప్పారు. ఆ సభ ద్వారా కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News