: శ్రీశైలం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో సున్నిపెంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి విజయవాడకు వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.