: ప్రాణ్ అంత్యక్రియలు పూర్తి
బాలీవుడ్ నట దిగ్గజం ప్రాణ్ పార్థివ దేహానికి ఈ సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబయిలోని శివాజీ పార్క్ లో కుటుంబ సభ్యులు, బాలీవుడ్ తారాగణం, భారీ సంఖ్యలో అభిమానుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. భోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తమ మిత్రుడి అంతిమ సంస్కారాలకు అమితాబ్, అనుపమ్ ఖేర్, శక్తి కపూర్, కరణ్ జోహార్, డానీ డెంజొప్పా, రాజ్ బబ్బర్ వంటి వెటరన్ నటులు హాజరయ్యారు.