: మోడీది జాలిగుండె: 'కుక్కపిల్ల' వ్యాఖ్యలపై బీజేపీ సమర్థన


'కుక్కపిల్ల కారుకింద పడితే బాధపడతాం కదా? కారు వేరొకరు నడుపుతున్నా, వెనుకసీట్లో కూర్చున్న వారికీ బాధ కలుగుతుంది' అని గుజరాత్ అల్లర్లపై వ్యాఖ్యానించిన సీఎం నరేంద్ర మోడీకి బీజేపీ దన్నుగా నిలిచింది. 'కుక్కపిల్ల' వ్యాఖ్యలపై పలు పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో తన భావి ప్రధాని అభ్యర్థిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆయనది జాలిగుండె అని పేర్కొంది. ఢిల్లీలో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ నేడు మీడియాతో మాట్లాడుతూ.. మోడీది చిన్నపిల్లాడి మనస్తత్వమని చెబుతూ, ఆయన పరిపూర్ణ కరుణామయుడని అభివర్ణించారు. కారు కింద కుక్కపిల్ల పడినప్పుడు దేశంలోని ఏ చిన్నపిల్లాడైనా ఎలా స్పందిస్తాడో, మోడీ కూడా అలాగే స్పందించారని రూడీ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News