: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం
జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సయ్యద్ అహ్మద్, హేమంత్ చేత ప్రమాణం చేయించారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేస్తూ గవర్నర్ ను కలిసింది. దీంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో రాష్ట్రపతి పాలన ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హేమంత్ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూసోరేన్ కుమారుడు. రానున్న ఎన్నికల్లో 10 ఎంపీ స్ధానాలను కాంగ్రెస్ కు కేటాయించాలనే షరతుతో జేఎంఎం ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.