: రూ.36 వేల కోట్లు విరాళం ప్రకటించిన రష్యా బిలియనీర్
ఓ రష్యా బిలియనీర్ తన ఉదారతను అతి భారీ స్థాయిలో చాటుకున్నాడు. ఫోర్బ్స్ జాబితాలో 46వ స్థానంలో ఉన్న వ్లాదిమిర్ పోటానిన్ అనే కోటీశ్వరుడు తన సంపదలో సగభాగాన్ని ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ రష్యా వ్యాపారవేత్త ఆస్తుల విలువ రూ. 72,500 కోట్లు కాగా దాదాపు రూ. 36 వేల కోట్లు సేవా కార్యక్రమాల కోసం అందించనున్నాడు.
పోటానిన్.. రష్యాలో ఇంటెర్రోస్ హోల్డింగ్ అనే సంస్థ కు అధిపతిగా వ్యవహరించడంతో పాటు ప్రపంచంలోనే నికెల్ ఉత్పత్తిలో అగ్రగామి అయిన నార్లిస్క్ నికెల్ సంస్థకు సహ యజమానిగా ఉన్నారు. ఇంతకుముందు అమెరికా కోటీశ్వరుడు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇలాగే భారీ వితరణ చేయడంతో వారి స్ఫూర్తితోనే ఈ విరాళం ప్రకటించానని పోటానిన్ వెల్లడించారు.