: ప్లూటో చంద్రుడు చిక్కాడు


సౌరకుటుంబంలో అత్యంత బుల్లిగ్రహం ప్లూటో. ఈ గ్రహానికి మొత్తం ఐదుగురు చందమామలున్నారు. వీరిలో అతి పెద్ద చందమామ చరాన్‌. అయితే ఈ చరాన్‌ కోసం చాలా కాలంగా అన్వేషణ జరుగుతోంది. చివరికి నాసాకు చెందిన ఒక వ్యోమనౌకలోని టెలిస్కోపు చరాన్‌ని తన చేతికి చిక్కించుకుంది. చక్కగా ఫోటో తీసి భూమికి పంపింది.

ప్లూటోతో బాటు గ్రహశకలాలతో కూడిన క్యూపర్‌ వలయంపై అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) న్యూహోరైజాన్స్‌ అనే వ్యోమనౌకను తొమ్మిదిన్నర ఏళ్ల క్రితం భూమిపైనుండి పంపింది. ఈ వ్యోమనౌక అప్పటి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చివరికి చరాన్‌ ఫోటోను భూమికి పంపించడంతో ఈ నౌక తన పని ప్రారంభించింది. ఈ వ్యోమనౌకలోని హై రిజల్యూషన్‌ టెలిస్కోపిక్‌ కెమెరా చరాన్‌ ఫోటో తీసింది. న్యూహోరైజాన్స్‌ ప్లూటోకు 88.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోటోల్లో చరాన్‌ పూర్తిగా మంచుతో నిండిపోయి ఉందట. ప్లూటో చంద్రుళ్లలో పెద్దదయిన చరాన్‌ ఆ గ్రహానికి 19 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ ఉపగ్రహాన్ని 1978లోనే గుర్తించారు. ఇప్పుడు చరాన్‌ ఫోటో గురించి ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్త హాల్‌వీవర్‌ మాట్లాడుతూ, సామాన్యులకు ఈ ఫోటో గొప్పగా అనిపించకపోవచ్చని, అయితే భూమినుండి తీసిన ఫోటోలతో పోలిస్తే ఇవి చాలా అద్భుతమైనవని అన్నారు. ఈ ఫోటోల వల్ల చరాన్‌, ప్లూటోల ఉపరితలాలకు సంబంధించిన కీలకమైన లక్షణాలను కూడా గుర్తించవచ్చని హాల్‌ వీవర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News