: ప్యాకేజి ప్రకటిస్తే కాంగ్రెస్ ఖతమ్: కేకే
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ కోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి చావు తథ్యమని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. కోర్ కమిటీ భేటీ అంశంపై ఆయన నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికి ఆరుసార్లు సమావేశమైనా ఏమీ తేల్చలేకపోయారని, ఎన్నడూ తెలంగాణ ఊసెత్తని నాయకులు నేడు హడావిడి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కోర్ కమిటీ భేటీలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూల నిర్ణయం వెలువడకపోతే తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తారని కేకే హెచ్చరించారు.