: ఓ గంట ముందే కోర్ కమిటీ భేటీ
తెలంగాణ అంశంపై తేల్చేందుకు సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ వేళలను మార్చారు. తొలుత ఈరోజు సాయంత్రం ఐదింటికి సమావేశం కావాలని నిర్ణయించినా.. ఓ గంట ముందుగా అంటే నాలుగింటికే భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో ఓ ప్రకటన చేశారు. సాయంత్రం మూడున్నరకే సిద్ధంగా ఉండాలని రాష్ట్ర నేతలకు ప్రధాని కార్యాలయం నుంచి సూచనలు అందాయి.