: పార్లమెంట్ సమావేశాలకు సహకరించండి: ప్రతిపక్షాలకు ప్రధాని విజ్ఞప్తి
రేపటి నుంచి ప్రారంభం కానున్నపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలు పూర్తిగా సహకరిస్తాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలతో భేటీ అయిన ప్రధాని..దేశంలోని అన్ని ప్రధాన సమస్యలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సమావేశాల్లో ప్రతిపక్షాల సూచనలు, సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ఆటంకం కలిగించకుండా ఉండాలని మన్మోహన్ సింగ్ ప్రతిపక్షాలను కోరారు.