: టీమిండియా బౌలింగ్... కెప్టెన్ కూల్ చేరిక


విండీస్ ట్రైసిరీస్ ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచింది. వరుస విజయాలతో మొదటి స్థానానికి చేరిన ధోనీ సేన, ఫైనల్లో శ్రీలంకతో మరో సారి తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా పిచ్ ను పరిశీలించి తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ కూల్ నిర్ణయించాడు. గాయం కారణంగా సిరీస్ ఆసాంతం ఆడని ధోనీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా బరిలో దిగుతున్నాడు. వరుణుడు ప్రతిసారీ మ్యాచ్ కు అడ్డుతగులుతూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచే అవకాశాలను తగ్గించేస్తున్నాడు. దీంతో తొలుత బౌలింగ్ చేయాలని కెప్టెన్ కూల్ నిర్ణయించాడు. తక్కువ పరుగలకే శ్రీలంకను పరిమితం చేసి మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి తమకు తిరుగులేదని నిరూపించాలని ధోనీ టీమిండియాకు సూచించాడు.

  • Loading...

More Telugu News