: ఆధిక్యంలో ఆసీస్... రికార్డు సృష్టించిన ఆగర్
యాషెస్ సిరీస్ లో తొలి టెస్టు రెండో రోజు రసవత్తరంగా మారింది. తొలుత 75/4 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను, 117 పరుగులకే 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఆధిక్యం ప్రదర్శించింది. తరువాతే క్రికెట్ లో అసలు మాజా రెండు దేశాల అభిమానులకు అందింది. చివరి వికెట్ గా వచ్చిన ఆగర్ 69 పరుగులతో 112 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో లంచ్ సమయానికి 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆసీస్ పతనం దిశగా పయనిస్తున్న సమయంలో దిగిన ఆగర్ అరంగేట్రమ్యాచ్ లోనే అర్ధసెంచరీ సాధించి సత్తా చాటాడు. దీంతో లంచ్ విరామసమయానికి ఆసీస్ 229/9 స్కోరు సాధించింది. అనంతరం ప్రపంచ రికార్డు సాధించిన ఆగర్ బ్రాడ్ బౌలింగ్ లో స్వాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 11 వ నెంబర్ ఆటగాడిగా 98 పరుగులు చేసి ఆగర్ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.